హు హు హు-
పురము దాటిన నేను పుణ్యలోకములన్నియు దర్శించి ,
గోలోకము వరకెళ్ళి నర నారాయణ మూల రూపముల స్తుతించి మూలము నెరిగి
యాత్మ రూపులయిన పరమాత్మల నెఱింగి అయ్యో ప్రాణమెటుపాయనో యని మర్మ మెరుగని నేను నాప్రాణమెటులుండెనో అని తిరిగిరాగ ..
మూర్ఖులయిన
నా బంధు జనులు , శిశ్యులు
నా దేహమును పాడె నెక్కించి
బూడిదచేసినారే .
అయ్యో
నా ప్రాణుడెటు పోయెనో అని వగచి వగచి విలపించె నే
నా యాత్మ
ప్రాణుడి ఆధార భూతుడైన ఆత్మ పరమాత్మ చూడవలెనని ఆశించి పయనమై అటూఇటూ ఎటెటో తిరిగి తిరిగి నా ఆలయము లో ప్రవెశ నెంచి
భంగపడ్డ నా ఆత్మ ఎటుపోవలనో శాశించ వారెవరో తెలియని , గురువెవరో తెలియక క్షోభించే నా ప్రాణుడిని ఏదుకుటెట్లు.
ఆత్మ రూపుడయిన
నేను
ప్రాణుడిని గుర్తించి మరియు నా దేహాలయము ను చేరుటెట్లు
ఆపుణ్య సతీపతుల గుర్తించి చేరుటెట్లో తండ్రీ! నను నన్నుఅనుగ్రహించుయ్యా
గురుదేవా సర్వదేవతారూపా
నా దేహాన్ని మించిన కోవెల లేదు
నా ప్రాణుడిని మించిన భలాఢ్యుడులేడు
నేను మనిషిని
సర్వలోక
సర్వప్రకృతి
సర్వదేవతా
మూల స్వరూపుడినేనేను నేనే మనిషిని.
ఎన్నో జన్మల సాక్షిభూతాన్ని నా అంత సంతుష్టుడు ఎవరూలేరు నా ప్రాణుడు నన్నుఎల్లవేళలా కాచును .
Written by ramakrishna on ugadi festival 2018. Hyderabad.
Thursday, 30 August 2018
Air- life
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment